Posts

Showing posts from January, 2019

‘మిస్టర్‌ మజ్ను’ అఖిల్‌ నిధి అగర్వాల్‌ mr. majnu akhil nidhi #jrntr #akkineni #nagarjuna

Image
ఏ నటుడికైనా ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా అవసరం. అఖిల్‌ అలా తనని తాను విమర్శించుకోగలడు. అదే తనని ఓ గొప్ప నటుడిగా మారుస్తుంది’’ అని అన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. అఖిల్‌ నటించిన ‘మిస్టర్‌ మజ్ను’ విడుదల ముందస్తు వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సంపాదించిన ప్రతి రూపాయినీ మళ్లీ సినిమాకే అందించే నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌. నేను పరిశ్రమకొచ్చిన కొత్తలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉండేవారు. వాళ్లలో వెంకీ అట్లూరి ఒకరు. తను నాకో నటుడిగా పరిచయం, తరవాత రచయితగా, దర్శకుడిగా పరిచయయ్యాడు. సుదీర్ఘమైన చలన చిత్రసీమలో ఎన్నో ప్రేమకథ చిత్రాలొచ్చాయి. తను ‘తొలిప్రేమ’లో కొత్తగా ఏం చూపిస్తాడో అనే బెరుకు ఉండేది. ఆ చిత్రం చూసిన తరవాత గర్వంగా అనిపించింది. ఓ కమర్షియల్‌ సినిమా తీయడం కన్నా కేవలం కథతో సినిమా తీయడం కష్టమైన పని. మొదటి చిత్రంతోనే అది సాధించాడు వెంకీ. రాసిపెట్టుకోండి.. అఖిల్‌ ఏదో ఓ రోజు టాలీవుడ్‌లో మంచి న...